వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి ఈరోజు మధ్యాహ్నం జరిగింది. 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ తేజ్ మూడుముళ్లు వేశారు. అయితే, ఈ పెళ్లి ఫొటోలు ఇంకా బయటికి రాలేదు. వాటి కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, అంతకు ముందు జరిగిన మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు మాత్రం బయటికి వచ్చాయి.
