ఓటీటీలో మా ఊరి పొలిమేర సినిమా ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది పొలిమేర మొదటి పార్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్ కోసం అందరినీ ఎదురుచూసేలా చేసింది. ఇప్పటికీ ఆ రెండో పార్ట్ థియేటర్లోకి వస్తోంది. గౌరికృష్ణ నిర్మాతగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీని పంపిణీదారుడు వంశీ నందిపాటి నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ మీడియాతో ముచ్చటించాడు
